Palla Rajeshwar Reddy: పల్లా గెలవాలన్న ముత్తిరెడ్డి.. కాంగ్రెస్లో ఇవి సాధ్యమా అన్న హరీష్ రావు

By :  Krishna
Update: 2023-10-11 12:32 GMT

కాంగ్రెస్ పార్టీ అంటే మూటలు, ముఠాలు, కుర్చీల మంటలని అని మంత్రి హరీష్ రావు అన్నారు. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లక్ష మెజార్టీతో గెలవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆకాంక్షించారని.. ఇలాంటి ఘటనలు కాంగ్రెస్లో ఉంటాయా అని అడిగారు. పల్లాను ముత్తిరెడ్డి ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల బాధ్యతను అప్పగించడం గొప్ప విషయమన్నారు. జనగామలో ఈ నెల 16న కేసీఆర్ సభ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫ్యూలు, కరెంట్ కోతలని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని పనులు 10 ఏళ్లు నిండకముందే కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. 2009లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలుచేయలేదన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని అమలుచేశారని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి, డాక్టర్ ఉత్పత్తి, రైతులకు 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమానికి జనగామ ప్రాంతం పోరు గడ్డ అని.. జనగామ అంటే కేసీఆర్కు ఎంతో ఇష్టం అని చెప్పారు. సీఎం మీటింగ్‌ కు లక్ష మంది వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్‌ సభను కార్యకర్తలు ముందుండి నడపాలన్నారు. బీఆర్‌ఎస్‌లో ఎటువంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. నాయకులు కలిసినట్లు కార్యకర్తలు ఎటువంటి మనస్పర్థలు లేకుండా కలిసిపోవాలని సూచించారు. అందరు కలిసికట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News