సిద్దిపేటకు సాగునీరు అందించండి.. ఉత్తమ్కు హరీశ్ రావు లేఖ

Byline :  Bharath
Update: 2023-12-17 15:52 GMT

సిద్దిపేట జిల్లాలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రంగనాయక్ సాగర్ ద్వారా గత మూడేళ్లుగా సిద్దిపేట జిల్లా భూములకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. దాని ద్వారా పంట దిగుబడి పెరిగి రైతుల జీవితాల్లో సంతోషం నిండిందని తెలిపారు. కానీ ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడ్డాయని, అందువల్ల యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. యాసంగి పంటకు సరిపడ నీళ్లు కావాలంటే 3 టీఎంసీలు అవసరం పడుతుందని.. కానీ ప్రస్తుతం రిజర్వాయర్ లో 1.50 టీఎంసీల నీరే ఉందని లేఖలో తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మిడ్ మానేరు నుంచి వెంటనే 1.50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు

Tags:    

Similar News