నాన్న నీతోనే నేను..సూర్యాపేటలో గుండెలను హత్తుకునే దృశ్యం

Update: 2023-08-14 15:43 GMT

అమ్మాయిలకు ఎప్పుడూ నాన్నే ఫేవరేట్. తండ్రే వారి మొదటి హీరో. ఆయన్నే తమ ఫ్రెండ్‎లా భావిస్తుంటారు. అమ్మలతో ఉండే అటాచ్మెంట్ కన్నా నాన్నలతో వారి రిలేషన్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పాల్సిందే. అందుకే తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి మాటల్లో వివరించలేము. కూతుళ్లను తండ్రులు గుండెల్లో పెట్టుకుని పెంచుతారు. అలాగే కూతుళ్లు తండ్రిని ప్రేమగా చూసుకుంటుంటారు. వారి అనుబంధపు మధురానుభూతిని ఎవరైనా ఆస్వాదించాల్సిందే. అలాంటిది తన తండ్రి ఈ లోకంలో లేడన్న వార్త ఓ కూతురిని తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. గుండెల్లో పెట్టుకుని పెంచిన తండ్రి మరణ వార్త కూతురిని తీవ్రంగా కలచివేసింది. తన తండ్రి ఇక రారని తెలిసి గుండెలు పగిలేలా రోధిస్తూ తన తండ్రి గుండెలపైనే తుదిశ్వాస విడిచిన విషాదకరమైన సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. మరణంలోనూ నాన్నతోనే వెళ్లిపోయిన కూతురిని చూసి గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు.




 


సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన తండ్రి మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధిస్తూ తండ్రి గుండెపైనే గుండెపోటుతో మరణించింది కూతురు వజ్రమ్మ. ఈ సంఘటన గ్రామంలోని ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ విగతజీవులుగా కనిపించడంతో కుటుంబసభ్యుల్లో బాధ రెట్టింపు అయ్యింది. ఈ హృదయవిదారక సన్నివేశం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. 




 




Tags:    

Similar News