కరుణించని వరుణుడు.. ఉదయం నుంచి కుండపోత..

Byline :  Kiran
Update: 2023-09-05 09:07 GMT

హైదరాబాద్పై వరుణుడు కరుణ చూపడం లేదు. జీహెచ్ఎంసీ అంతటా ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. వాన తెరిపి ఇవ్వకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లోనూ వర్షం భీకరంగా పడుతోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ,అమీర్ పేట్, బాలా నగర్, కూకట్పల్లి, మెహిదీపట్నం, షేక్ పేట్, మాదాపూర్ గచ్చిబౌలీ ప్రాంతాల్లో భారీగా వానపడుతోంది. అటు రాజేంద్ర నగర్ మలక్ పేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్ తార్నాక, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. హకీంపేట్, బొల్లారం, అల్వాల్ తదితర ప్రాంతాల్లోనూ గ్యాప్ లేకుండా వర్షం పడుతోంది. కుంభవృష్టి కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని సెల్లార్లలోకి వర్షపు నీరు చేసింది.


 



రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీటిలో బండ్లు నడపలేక వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బీహెచ్ఈఎల్ నుంచి ఖైరతాబాద్ రూటులో కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జామైంది. మూసాపేట మెట్రో స్టేషన్ కింద.. భారీగా వరద నీరు నిలిచిపోయింది. పై నుంచి వస్తున్న వరద నీటితో.. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి.




 




Tags:    

Similar News