24 గంటల్లో భారీ వర్షం...ఎవరూ బయటకు రావొద్దు

Update: 2023-07-21 16:31 GMT

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా వానలు దంచి కొడుతుండడంతో జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికి జారీ చేసింది.

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఈ 3 జిల్లాల ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. వరదలు, చెట్లు కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదుకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-211 11111, 90001 13667కు ఫోన్‌ చేయాలని సూచించారు.

అధికారులను మంత్రి తలసాని అలర్ట్ చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాని ఆదేశించారు. తాజా పరిస్థితులపై GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.


Tags:    

Similar News