అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో భారీ వర్షం

Update: 2023-09-22 02:14 GMT

కొన్ని రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్‌‌లో మళ్లీ వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌ నగర్‌, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్‌, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌ తదితర చోట్ల వర్షం పడింది. వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వినాయక నిమజ్జనాలకు వచ్చిన వాహనాలు వర్షంలో చిక్కుకున్నాయి. తెల్లవారుజామున పనులపై బయటకు వెళ్లే వారు వర్షం కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

మరోవైపు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు చేరింది. ద్విచక్రవాహనాలు వర్షం వల్ల వచ్చిన వరదతో ముందుకు కదలడం ఇబ్బందికరంగా మారడంతో రాత్రి వేళ ఇంటికి వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీళ్లు నిలిచి ఉండడంతో ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయో, ఎక్కడ డ్రైనేజ్‌లున్నాయో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి నుంచి వాన పడుతుండటంతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వానల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది.




Tags:    

Similar News