తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

By :  Krishna
Update: 2023-11-08 17:27 GMT

తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేగాక ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఇక ఇవాళ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మూడు గంటలపాటు వర్షం దంచికొట్టింది. రిలింగంపల్లి, లింగంపల్లిలో 4, చందానగర్‌లో 3.5 సెంటీమీటర్ల వర్షం పడింది. భద్రాద్రి-కొత్తగూడెంలోని మద్దుకూరులో 10 సెంటీమీటర్లు, నారాయణపూర్‌లో 7.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


Tags:    

Similar News