Medaram : మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..ఇప్పుడే ఇలా ఉంటే?

Update: 2024-01-28 11:30 GMT

తెలంగాణ కుంభమేళా మేడారానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరిగిపోతోంది. మహా జాతర దగ్గరపడుతుండడంతో మేడారం పరిసరప్రాంతాలన్నీ జనసంద్రమవుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న వనదేవతలను తనివితీరా కొలిచేందుకు బారులు తీరుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు.

తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సమ్మక్క, సారలమ్మల దర్శనానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు. జంపన్న వాగు నుంచి చింతల్ క్రాస్ రోడ్డు వరకు రద్దీ కొనసాగుతున్నది. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News