ఎమర్జెన్సీ అయితే చెప్పండి.. హెలికాప్టర్లు పంపిస్తాం: మంత్రి హరీష్ రావు

Update: 2023-07-20 15:25 GMT

రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాతాల్లో అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.


Full View


చాలా ప్రాంతాలు ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు చేశారు. వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎమర్జెన్సీ మెడికల్ అవసరాల కోసం అవసరమైతే హెలికాప్టర్ పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

గురువారం (జులై 20) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించిన హరీష్ రావు.. అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులు తీసుకోవాల్సిన చర్యలను గుర్తుచేశారు. ప్రజలకు ఎలాంటి ఆటంకం, ప్రాణహాని జరుగకుండా చూడాలని తెలిపారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో 24×7 కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే.. 040-24651119 కి కాల్ చేయాలని సూచించారు.


Tags:    

Similar News