హలో లండన్.. రేవంత్ను నేరుగా కలుసుకునే అవకాశం

By :  Krishna
Update: 2024-01-12 12:51 GMT

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ టూర్ వెళ్తున్నారు. 15 నుంచి 19వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్నారు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో కలిసి ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశంపై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ నేతలు హలో లండన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. జనవరి 19న సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది.

హెస్టన్ హైడ్ హోటల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయులు నేరుగా సీఎం రేవంత్ను కలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా రేవంత్ సీఎం అయ్యాక తొలి విదేశీ టూర్ ఇదే. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 100 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు పాల్గొంటారు. ఈ సారి లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో మన దేశంలోని కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.




Tags:    

Similar News