కేటీఆర్.. మాకు పెట్రోల్ ఫ్రీగా రావడం లేదు.. హీరోయిన్ సంచలన ట్వీట్!

Update: 2023-07-20 07:59 GMT

హైదరాబాద్ ట్రాఫిక్పై హీరోయిన్ డింపుల్ హయాతి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఏకంగా ఆమె మంత్రి కేటీఆర్, సీఎంవోను ట్యాగ్ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్కి కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడంటూ ఆమె చేసిన ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

‘‘ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏంటీ..? ట్రాఫిక్ డీసీపీలు ఎటుపోయారు? అసలు హైదరాబాద్లో కాలు బయట పెట్టగలమా? మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదు’’ అని డింపుల్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ అకౌంట్స్ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కాగా పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కారును తన్నడంతో పాటు డ్రైవర్ని దూషించిందంటూ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డింపుల్ హయాతీ మీద కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అయితే రాహుల్ హెగ్డే తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని.. నిజాలు త్వరలో తెలుస్తాయని డింపుల్ అప్పట్లో వివరణ ఇచ్చారు. కాగా డింపుల్ హయాతి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె లేటెస్ట్ మూవీ రామబాణం డిజాస్టర్ అయ్యింది.

Tags:    

Similar News