Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Byline :  Krishna
Update: 2023-12-19 07:42 GMT

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రెండు వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కూడా ప్రత్యేక నజర్ పెట్టింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీపై అధికారులు, ఎల్ అండ్ టీతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని నిలదీశారు. ప్రజాధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమైన వారెవరనీ వదలిపెట్టమని తేల్చి చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News