ఓ ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేమిటి?

By :  Kalyan
Update: 2023-07-28 11:51 GMT

ఓఆర్ఆర్ టెండర్ల వివరాలు అడిగితే ఓ ఎంపీకి ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని...ప్రతిపక్షాలకు డీటెయిల్స్ ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఓఆర్ఆర్ లీజు టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి హకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగిందని....వివరాలు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్టీఐని కోరారు. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రెండు వారాల్లో ఆయనకు ఓఆర్ఆర్ డీటెయిల్స్ అన్ని సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.హైకోర్టు తీర్పుకు స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలిపారు.

Tags:    

Similar News