ములుగు జిల్లాలోని గ్రామాలపై తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాతాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం (జులై 5) హైకోర్ట్ తీర్పునిచ్చింది. 75లఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ తీర్పు రావడంతో గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. మంగపేట మండలంలోని ఆయా గ్రామాలు షెడ్యూల్ 5 కిందికి వస్తాయని తీర్పు ద్వారా స్పష్టం చేసింది హైకోర్ట్. షెడ్యూల్ 5 గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు ప్రత్యేక హక్కులు దక్కనున్నాయి.