తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Byline :  Vamshi
Update: 2024-02-16 16:18 GMT

తెలంగాణ పోలీసుల ప్రవర్తనాశైలి ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తోందని హైకోర్టు పేర్కొంది. కరీంనగర్ 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో మహిళ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో బాధిత మహిళ హైకోర్టు ఆశ్రయించింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులను నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. పోలీసు స్టేషన్‌‌కు ఎవరు సరదాగా రారని ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం కష్టంగా మారిందని విచారం వ్యక్తం చేసింది. ప్రజలు కంప్లయింట్ చేయడానికి వస్తే పట్టించుకోవడం లేదని పోలీసుల తీరుపై హైకోర్టు జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేవారు. పోలీసులు ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకున్నా..ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని..ఫిర్యాదుదారులను భయాందోళన లకు గురి చేస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజల కోసమే పోలీసులు పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లకు ఎవరూ సరదాగా రారన్న హైకోర్టు.. ఎఫ్ ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News