నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

Update: 2023-11-13 05:31 GMT

హైదరాబాద్‌లోని నాంపల్లి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 9.45 ని.ల సమయంలో బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లుగా సమాచారం. మరో ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. దాదాపు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడకు చేరుకున్నారు. మంటల ధాటికి అక్కడే ఉన్న వాహానాలన్నీ దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఆ అంతస్తుల్లో ఉన్న వారు.. కిందకు రాలేక ఫైర్ సిబ్బంది సాయంతో.. నిచ్చెనల ద్వారా బయటకు వచ్చారు . అగ్ని ప్రమాదం సంభవించడానికి గల పూర్తి కారణాలు, వివరాలు తెలియారాలేదు.

పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలకు ఆ బిల్డింగ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న బైక్స్, కార్లు తగలబడ్డాయి. బిల్డింగ్ బయటకు ఉన్న వాహనాలు సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. కెమికల్స్ పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో.. మంటలను ఆర్పటం కష్టంగా మారింది.

Tags:    

Similar News