రేవంత్ ప్రజా దర్బార్.. భారీగా తరలివచ్చిన జనం

By :  Kiran
Update: 2023-12-08 05:26 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. వారి నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకునేందుకు వందలాది మంది జనం తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే జ్యోతిరావు పూలే ప్రజా భవన్ వద్ద భారీగా క్యూ కట్టారు. ఉదయం 10 గంటలకు అక్కడకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వారి సమస్యలు విని, వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రజా దర్బార్ కు వచ్చే దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాల ఏర్పాటు చేశారు.

ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా సీఎం రేవంత్ చర్యలు చేపట్టనున్నారు.


Tags:    

Similar News