మాసబ్ ట్యాంక్ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

Update: 2023-06-07 06:02 GMT

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆయిల్​ మొత్తం నేలపాలయింది. ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడటంతో మెహదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ వరకు పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, లక్డీకపూల్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. వీటితో పాటు ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తీశారు.


స్థానికుల వివరాల ప్రకారం.. మెహదీపట్నం నుంచి మాసబ్​ట్యాంక్​కి ఓ ట్యాంకర్​ క్రూడ్​ ఆయిల్​తో వస్తోంది. ఈ క్రమంలో మహవీర్​ ఆసుపత్రి దగ్గరకు రాగానే బోల్తా పడింది. దీంతో అందులోని ఆయిల్​ మొత్తం రోడ్డుపై పారింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావటంతో.. ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డు ఎక్కటంతో.. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ట్రాఫిక్ జాం అయ్యింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్డుపై పడిన ఆయిల్ పై ఇసుక, మట్టి వేస్తున్నారు. ఈలోపే పలు బైకర్లు స్కిడ్ అవ్వడంతో స్పల్ప గాయాలయ్యాయి. సహజంగా ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అలాంటి రూట్లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో.. ట్రాఫిక్ జాం అయిపోయింది. వెంటనే అధికారులు స్పందించి ట్రాఫిక్​ ను క్లియర్​ చేశారు. 


Tags:    

Similar News