Anishetti Sridevi : ట్రైబల్ పిల్లలకు పాల పంపిణీలో స్కామ్.. మాజీ సీడీపీఓ అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

Byline :  Bharath
Update: 2024-02-29 14:17 GMT

హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్ అయ్యారు. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ శ్రీదేవిని కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించింది. శ్రీదేవి గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ కూడా సీడీపీఓగా పనిచేశారు. ఆ టైంలో కూడా నిధులను దుర్వినియోగం పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చుల్లో జరిగిన అవకతవకలపై కేసు నమోదు చేశారు. నకిలీ ఇండెంట్లు సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఆరోగ్యలక్ష్మీ మిల్క్ స్కీమ్ ద్వారా మొత్తం రూ.65.78 లక్షలు దారి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీదేవి దాదాపు 322 అంగన్వాడీ కేంద్రాల నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు. ఈ స్కామ్ 2015-2016 మధ్య జరిగిందని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News