ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులపై దాడులు ఆగటం లేదు. అమెరికాలోని టెక్సాస్ కాల్పుల్లో హైదరాబాద్ యువతి తాటికొండ ఐశ్వర్య మృతి ఘటన మరువక ముందే మరో ఘోరం చోటు చేసుకుంది. లండన్‌లో మరో తెలుగు అమ్మాయి దారుణ హత్యకు గురైంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఆమెపై దాడి చేయగా.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో అమ్మాయి తీవ్రంగా గాయపడింది.
ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లి కి చెందిన తేజస్విని రెడ్డి ఉన్న త చదువుల కోసం లండన్ వెల్లింది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది. తన మిత్రులతో కలిసి నివాసం ఉంటున్న తేజస్విని ఎదురుగా ఉన్న ప్లాట్‌లోకి వారం రోజుల క్రితం బ్రెజి కి చెందిన వ్యక్తి కొత్తగా వచ్చాడు. అదే సదరు వ్యక్తి తేజస్విని మరియు అతని స్నేహితురాలు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా తేజస్విని అక్కడికక్కడే మృతి చెందగా మరొక అమ్మాయి అఖిలకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలు ఆ బ్రెజిల్ వ్యక్తి ఎవరు ? ఎందుకు ఇద్దరమ్మాయిలపై దాడి చేశాడు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజస్విని మృతి చెందినట్లుగా లండన్ అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త తెలిసి తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.