Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణ.. 70 కి.మీ రూట్ మ్యాప్ ఇదే

Byline :  Bharath
Update: 2024-01-22 16:26 GMT

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా అధికారుల ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. మెట్రో విస్తరణలో భాగంగా.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.

ఖరారైన మెట్రో మార్గాలివే:

కారిడార్ 2: MGBS నుంచి ఫలక్ నుమా వరకు (5.5 కి.మీ)

కారిడార్ 2: ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కి.మీ)

కారిడార్ 4: నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (29 కి.మీ)

కారిడార్ 4: మైలార్ దేవ్ పల్లి నుంచి కొత్త హైకోర్ట్ వరకు (4 కి.మీ)

కారిడార్ 5: రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు (88 కి.మీ)

కారిడార్ 6: మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు (14 కి.మీ)

కారిడార్ 7: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు (8 కి.మీ)




Tags:    

Similar News