ఓఆర్‌ఆర్‌పై వేగపరిమితి పెంపు..

Update: 2023-06-27 12:17 GMT

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల వేగపరిమితిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్‌ఆర్‌పై వాహనాలు వెళ్లే గరిష్ట వేగాన్ని పెంచారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగాన్ని.. 120కి.మీకి పెంచారు. ఓఆర్‌ఆర్‌ అధికారులతో మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వివరాలను వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వేగపరిమితిని పెంచడానికి అవసరమైన అన్ని భద్రతా ప్రోటోకాల్‌ను ఉంచాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించారు.

Tags:    

Similar News