హైదరాబాద్ సీపీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

By :  Krishna
Update: 2023-11-20 11:50 GMT

హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌ సీపీ కార్యాలయంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో సిబ్బంది ఆయన్ను హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్‌ శాండిల్యను సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ పరామర్శించారు. కాగా ఈసీ ఆదేశాలతో ఇటీవలె ఆయన హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు.

Tags:    

Similar News