Telangana Express : తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్..

Byline :  Krishna
Update: 2024-01-28 02:29 GMT

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ చేసింది. ట్రైన్ టైమింగ్ మారినట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇవాళ 8 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు ప్రయాణికులకు తెలిపింది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు స్టార్ట్ అవుతుందని వివరించింది. ప్రయాణికులు దానికి అనుగుణంగా తమ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించింది. రైలు ఆలస్యానికి కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కాగా శనివారం కూడా రైలు 8 గంటలు ఆలస్యంగా రైలు బయలుదేరింది. శుక్రవారం సైతం ముంబైలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ 7 గంటలకు స్టార్ట్ అయ్యింది.


Tags:    

Similar News