Hyderabad : హైదరాబాద్ ట్రాఫిక్‌పై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Byline :  Vamshi
Update: 2024-02-26 03:43 GMT

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరం దిశగా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్ధేశం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం నగరంలో రోడ్డు విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో, పరిష్కారమార్గాలపై దృష్టి సారించిన ప్రభుత్వం అండర్ గ్రౌండ్ టన్నెల్‌ల నిర్మాణమే సరైనదనే నిర్ణయానికి వచ్చింది. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పలు రద్దీ ప్రదేశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు టన్నెల్ రహదారుల నిర్మాణంపై దృష్టి సారించి దీనికి సంబందించిన ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.




 


ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో టన్నెల్స్ నిర్మించనున్నారు. 39 కిలోమీటర్ల సొరంగ మార్గాల నిర్మాణాలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఐటీసీ కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ్ మీదుగా విప్రో సర్కిల్ వరకూ 9 కిలోమీటలర్ల టన్నల్ నిర్మించనున్నారు. అదే విధంగా, ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్‌టీయూ వరకూ 8 కిలోమీటర్ల మేర మరో సొరంగం నిర్మిస్తారు. వీటితో పాటు, ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-45 మీదుగా రోడ్ నెంబర్-10 వరకూ 7 కిలీమీటర్ల మేర మరో టన్నెల్ సిద్ధం చేస్తారు. ఇక జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ వరక 6 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగ్‌రోడ్డు వరకూ 9 కిలోమీటర్ల టన్నెల్ ఈ నిర్మాణాలు పూర్తయితే నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.




 



Tags:    

Similar News