వానలో ఫోటోలు కొడుతున్న హై.బా. ట్రాఫిక్ పోలీసు..

Update: 2023-07-28 16:20 GMT

కొందరుంటారు, వానొచ్చినా వరదొచ్చినా డ్యూటీ డ్యూటీనే అంటారు. ముఖ్యంగా పోలీసుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కరోనా విపత్తులో సైతం ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసిన మంచి పోలీసులు కొందరున్నారు. వారితో పాటు పైవాళ్లు చెప్పారనో, లేకపోతే తమ పని తాము తాము చేయాలనో అతి చేసే కానిస్టేబుల్స్ కూడా తక్కువేం కాదు. కొన్నిచోట్ల శ్రుతి మించిపోతుంటుంది. కారణం ఏదైనా పోలీసులపై ప్రజల్లో ఉండే కొన్ని అభిప్రాయాలు నానాటికీ మరింత బలపడుతుంటాయి. హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు వానలో సైతం వెనక్కి తగ్గకుండా ఫోటోలు టపటపా కొడుతూ వైరల్ అయ్యాడు. ఎప్పట్లాగే మామూలు రోడ్డుమీద కాకుండా నిండా నీటిలో మునిగిన రోడ్డు పక్క నిల్చుని కొట్టాడు. అటుగా వెళ్తున్న వాహనాలకు చలానా విధించడానికే ఫోటోలు తీసుకున్నాడని చూసిన జనం ఎవరైనా అనుకుంటారు. ఫోటోలు తీస్తున్న ఆయనను ఎవరో ఫోటో తీసి ట్విట్ చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. వర్షంలో సైతం అంతకష్టపడి ప్రభుత్వానికి ఆదాయం పెంచుతున్న అతనికి అవార్డు ఇవ్వాలని సటైర్లు పడుతున్నాయి. ట్వీట్‌కు హైదరాబాద్ పోలీసులను కూడా ట్యాగడంతో ఖాకీలు వివరణ ఇచ్చారు.

తమ సహచరుడు చలానా వేయడానికి ఫోటోలు తీయడం లేదని, రోడ్డు పరిస్థితిని రికార్డు చేయడానికే కొట్టాడని చెప్పుకొచ్చారు. ‘‘మా ఉద్యోగి చలానా వేయడం లేదు. అయోధ్య జంక్షన్ నుంచి బాస్రిగాడికి వెళ్తే దారిలో నీట మునిగింది. నీట మునిగినప్పుడు, నీటిని తొలగించాక ఫోటోల తీయడానికి ఇలా చేశాడు’’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ వివరణతో జనం తృప్తి పడడం లేదు. కొందరైతే అతణ్ని కాకుండా పోలీసు వ్యవస్థపై విమర్శలు సంధించారు. ‘‘టార్గెట్లు ఇచ్చి అవి రీచ్ అవకపోతే పాపం పోలీసుల రక్తం తాగుతున్నారేమో పైనోళ్లు’’ అని అంటున్నారు. చూసే కళ్లను బట్టి ఉంటుందని కొందరు సామెతలు తీస్తున్నాయి.

https://twitter.com/SaiKumarNethas/status/1684496236165083136?s=20

Hyderabad traffic police taking photos on submerged roads for alleged challans

Hyderabad traffic police, police taking photos in rain, road submerged, Hyderabad rains, police challan

Tags:    

Similar News