యూఎస్ కాన్సులేట్ ఆఫీసులో తాపీ మేస్త్రీ జాబ్.. లక్షల్లో జీతం.. మరో 20 రోజులే గడువు
‘తాపీ మేస్త్రీ కావాలెను.. రూ. 4 లక్షల వార్షిక వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం. అర్హులైన వారు అప్లై చేసుకోండి’.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ ప్రకటన నిజంగా నిజం. ఇది ప్రకటించిని మరెవరో కాదు.. యూఎస్ కాన్సులేట్. తెలుగు రాష్ట్రాల పరిధిలో వీసా సేవలు అందించేందుకు.. హైదరాబాద్ లో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉంటుంది. తాజాగా కొత్త ఆఫీస్ ను (కొత్త బిల్డింగ్) ప్రారంభించారు. వీరు తాజాగా తాపీ మేస్త్రీ కావాలని సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఏకంగా ఉద్యోగ నియామకం చేపట్టారు. FSN-04 గ్రేడ్ కింద తాపీ మేస్త్రీ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఏడాదికి రూ.4,47,349 జీతంతో పాటు.. ఇతర ప్రయోజనాలు కూడా వర్తింపజేస్తామని యూఎస్ కాన్సులేట్ తెలిపింది.
ఈ నియామక దరఖాస్తులు ఎలక్ట్రానిక్ పద్దతిలో ఆమోదించబడతాయి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 25. https://in.usembassy.gov/embassy-consulates/jobs/hyderabad/ ... ఈ వెబ్ లింకు ద్వారా తాపీ మేస్త్రీ జాబ్ కు అప్లే చేసుకోవచ్చు.
‘‘ తాపీ మేస్త్రి కావలెను
గ్రేడ్ : FSN-04
చివరి తేది: 25 Feb, 2024
వార్షిక పరిహారం : 4,47,348/- (Per Year)+ ఇతర ప్రయోజనాలు
అమెరికన్ కాన్సులేట్ తాపీ మేస్త్రి కోసం నియామకాన్ని ఆహ్వానిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ వివరాల కోసం దయచేసి సందర్శించండి
https://in.usembassy.gov/embassy-consulates/jobs/hyderabad
దరఖాస్తులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో మాత్రమే ఆమోదించబడతాయి’’ అంటూ ప్రకటనలో తెలిపారు.
తాపీ మేస్త్రి కావలెను
— U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) February 6, 2024
గ్రేడ్ : FSN-04
చివరి తేది: 25 Feb, 2024
వార్షిక పరిహారం : 4,47,348/- (Per Year)+ ఇతర ప్రయోజనాలు
అమెరికన్ కాన్సులేట్ తాపీ మేస్త్రి కోసం నియామకాన్ని ఆహ్వానిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ వివరాల కోసం దయచేసి సందర్శించండిhttps://t.co/zNdz8y9qr8
దరఖాస్తులు… pic.twitter.com/y9KWDnUbiU