శివబాలకృష్ణ కేసులో ట్విస్ట్.. తెరపైకి ఐఏఎస్ అధికారుల పేర్లు
తీగ లాగితే డొంక కదిలినట్లు.. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని అధికారుల ఆస్తులకు సంబంధించిన చిట్టా వెలుగులోకి వచ్చింది. హెచ్ఎండీఏ ఆస్తులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తుండగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఐఏఎస్ అరవింద్ కుమర్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. అడ్డగోలుగా తన ద్వారా అరవింద్ కు కావాల్సిన బిల్డింగ్ లకు పర్మిషన్ ఇప్పించుకున్నట్లు శివబాలకృష్ణ తెలిపారు. అరవింద్ ఒత్తిడితో.. నార్సింగిలో ఓ వివాదాస్పద భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ డాక్యమెంట్లు పరిశీలిస్తుండగా.. సోమేష్, రజిత్ కుమార్ ఆస్తుల పేపర్లు దొరికినట్లు అధికారులు తెలిపారు. డీవోపీటీ అనుమతి లేకుండా మహబూబ్ నగర్ లో 52, యాదాద్రి జిల్లాల్లో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు.
శివబాలకృష్ణకు ఆదేశాలు జారీ చేసి అరవింద్ కుమార్ అవసరమైన భూముల అనుమతులు తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో 12 ఎకరాల భూమి, నార్సింగిలోని ఓ కంపెనీ వివాదాస్పద భూమి క్లియరెన్స్ ఇచ్చారు శివబాలకృష్ణ. నార్సింగి ఎస్ఎస్‌వీ ప్రాజెక్టు అనుమతి కోసం రూ.10కోట్లను అరవింద్ కుమార్ డిమాండ్ చేసినట్లు చెప్పారు. అడ్వాన్స్ గా రూ. కోటిని షేక్ సైదా చెల్లించగా.. శివబాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు నగదు చేసింది. మహేశ్వరంలో మరో బిల్డింగ్ కోసం రూ. కోటి డిమాండ్ చేశారు. మంకల్ దగ్గరున్న వర్ట్ ఎక్స్ హోమ్స్ కు అరవింద్ కుమార్ అనుమతులిచ్చారు. దీనికోసం అరవింద్ కుమార్ ఒక ఫ్లాట్ రాయించుకున్నాడు.
ఇప్పటి వరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ వద్ద రూ.250 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. 215 ఎకరాల భూమి పేపర్లపై శివబాలకృష్ణ చెప్పడంతో ఇతర అధికారులు సంతకాలు పెట్టారు. ఆయన చెప్పడంతో.. అవి అక్రమాస్తులే అయినా పర్మిషన్ లేకుండానే అనుమతులు జారీ చేసిన మిగతా అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు శివబాలకృష్ణ 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు బినామీల పేర్లపై ఉన్నాయని అధికారులు గుర్తించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు.