KTR : మేడిగడ్డ బ్యారెజీలో ఇబ్బంది జరిగితే రిపేర్ చేయండి..మాజీ మంత్రి కేటీఆర్
అసెంబ్లీలో బడ్జెట్, నీళ్లపై చర్చలు వాడి వేడిగా సాగుతోంది. కాళేశ్వరం అంటే ఒకే బ్యారెజీ కాదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అందరి సభ్యులను ఒకటే విధంగా చూడాలని స్పీకర్ కు చెప్పారు. రాజగోపాల్ రెడ్డి మాటలను రికార్డ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. మాట్లేడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హాయంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి అయిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఏ రిజర్వాయర్ అయినా కాళేశ్వరం ద్వారానే జరిగిందని గుర్తు చేశారు.
ఒక్క బ్యారెజీలో మూడు, నాలుగు పిల్లర్లలో ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండని కోరారు. మేడిగడ్డకు పోయి వచ్చి బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై కోపం ఉంటే రాజకీయంగా ప్రయత్నించండని..అంతేగాని రైతులపై కక్ష్య పెంచుకొవద్దని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.