బాసర ట్రిపుల్ ఐటీ.. ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడగింపు.. చివరి తేది ఎప్పుడంటే..
బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్ చివరి తేది ఇవాళ్టితో (జూన్ 19) ముగియనుంది. అయితే, ఆ గడువును జూన్ 22 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన మరికొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలు పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను జులై 3న విడుదల చేస్తారు. ఓసీ, ఓబీసీ విద్యార్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 450 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా.. సీట్లను కేటాయిస్తారు. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు అప్లే చేసుకునేందుకు వీలు లేదు. అప్లై చేసుకునేందుకు https://www.rgukt.ac.in/admissions2023.html లింక్‌పై క్లిక్ చేయండి.