మండి పోతున్న రాష్ట్రానికి చల్లని కబురు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Update: 2023-08-13 16:25 GMT

గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మయన్మార్, బంగ్లాదేశ్ పై ఉన్న మేఘాలు.. ఆదివారం తెలుగు రాష్ట్రాల వైపు కదలనున్నాయి. దాంతో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్‌, భువనగిరి, నల్గొండ, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నకారణంగా.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు.




Tags:    

Similar News