గ్రూప్‌-1 అభ్యర్థులకు కీలక సూచనలు..

Update: 2023-06-10 14:07 GMT

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు చేసింది.

ఇవే నిబంధనలు

* పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు

* పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులకు అనుమతి నిరాకరణ

* అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు

* నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి

* జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదు

* వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేసే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదు

* 3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలి


Tags:    

Similar News