సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు

By :  Vinitha
Update: 2024-03-22 07:04 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఎవరైనా తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని బెయిల్ కోసం ముందు కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని అంగీకరించమని చెప్పింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. పిటిషన్ లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామన్న సుప్రీం...ఈడీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది, రాజకీయవేత్త కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

Tags:    

Similar News