1350 మంది విద్యార్థులతో.. 45,000వేల అడుగుల్లో జాతీయ జెండా

By :  Lenin
Update: 2023-08-15 01:44 GMT

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో విశ్వ గురు వరల్డ్ రికార్డ్ వారి పర్యవేక్షణలో విజ్ఞాన జ్యోతి పాఠశాలలోని 1350 మంది విద్యార్థుల చేత సామూహిక ప్రతిజ్ఞను చేయించింది.మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్షర రూపంలో ప్రదర్శిస్తూ 45,000వేల అడుగుల్లో జాతీయ జెండా రూపంలో ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అశోక ధర్మ చక్రం ప్రతిజ్ఞను చేయించారు.

24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని ఈ వారి చేత చెప్పించారు. అశోక చక్ర ప్రతిజ్ఞ జీవితంలో ఆచరిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుందని తెలిపారు. రాబోవు తరాలకు దేశభక్తి, నైతికత, సమగ్రత, కుల, మతాలకతీతంగా దేశ ఔన్నత్యాన్ని విద్యార్థుల్లో ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు.

ఆగస్టు 14వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగా అందించారు.



Tags:    

Similar News