Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-24 07:42 GMT

సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని పూర్తిగా మార్చేసింది.మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారి, సిబ్బందిని ప్రస్తుత సీఎం వద్ద ఉంచొద్దని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త వారిని నియమిస్తూ ఇంటెలిజెన్స్ నిర్ణయం తీసుకోగా.. సెక్యూరిటీ మార్పునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన ప్రతీ సమాచారం లీక్‌ అవుతోందనే నేపథ్యంలోనే ఐబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద భద్రతా అధికారులను మార్చాలని నిర్ణయించింది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని.. సిబ్బందిని కూడా సీఎం రేవంత్‌ వద్ద పెట్టొద్దని సీఎంవోను ఐబీ ఆదేశించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక పలు విభాగాల అధిపతుల్ని మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలకమైన నిఘా విభాగాధిపతిగా శివధర్‌రెడ్డిని నియమించింది రేవంత్‌ సర్కార్‌.




Tags:    

Similar News