బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం.. విద్యార్థిని మ‌ృతి

Update: 2023-06-13 07:36 GMT

హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న వంశిత అనే విద్యార్థిని భవనంపై నుంచి పడి మృతి చెందింది. కాలేజ్‌ బిల్డింగ్‌ ఐదోఅంతస్తు నుంచి కింద పడి మరణించింది. కామరెడ్డిజిల్లాకు చెందిన రాగుల వంశికను ఆమె తల్లిదండ్రులు ఈ నెల 9 న .. సరిగ్గా 4 రోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌లో చేర్పించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ..ఈ ఉదయం కాలేజ్‌ భవనం వెనుకవైపు విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంది.




దీంతో హుటాహుటిన కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. వంశిక పేరెంట్స్ గుర్తొస్తున్నారని తరచూ ఫ్రెండ్స్ తో చెప్పి బాధపడేదని తెలిపారు. ఉదయం వాంతులు అవుతున్నాయని.. బయటకు వెళ్లాలని కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర పర్మిషన్ తీసుకుందని తోటి విద్యార్థినులు చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత 5 వ అంతస్తు పైకెళ్లి బిల్డింగ్ పై నుండి దూకిందన్నారు. ఘటనపై మరికొన్ని వివరాలు తెలియాల్సి వుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


Tags:    

Similar News