అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలతో ఆప్యాయంగా కేటీఆర్...

Update: 2023-08-03 08:48 GMT

తెలంగాణ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించిన తర్వాత శాసనసభ రేపటికి వాయిదా నడింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల బెంచ్ వద్దకు వెళ్లారు. ఈటలను ఆప్యాయంగా పలకరించి హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు 10నిమిషాల పాటు ముచ్చటించారు.

కొన్ని కారణాలతో ఈటల బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. అప్పటినుంచి కేసీఆర్ వర్సెస్ ఈటలగా పరిస్థితి మారింది. అయితే కేటీఆర్ మాత్రం ఈటలపై ఎప్పుడూ సాఫ్ట్ కార్నర్తోనే ఉండేవారు. గతంలో కూడా పలుసార్లు ఈటలను కేటీఆర్ అప్యాయంగా పలకరించారు. ఈటల తనకు పెద్దన్నలాంటివారని కేటీఆర్ ఇప్పటికే చెప్పారు. ఈటల తనకు ప్రాణహాని ఉందన్నప్పుడు కూడా కేటీఆర్ వెంటనే స్పందించి.. బందోబస్త్ పెంచాలని డీజీపీకి సూచించారు.




 


బీఏసీ మీటింగ్కు పిలవకపోవడంపై

మరోవైపు బీఆర్ఎస్ తీరుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. సమైక్య పాలనలో ఒక్క సభ్యుడు ఉన్న బీఏసీకి పిలిచేవారని.. కానీ ప్రస్తుతం బీజేపీ ముగ్గురు సభ్యులున్నా..పిలవలేదని విమర్శించారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా తమకు గది కేటాయించలేదని.. ఈరోజు ఉదయం స్పీకర్‌కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదని వివరించారు.


Tags:    

Similar News