ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే..

Byline :  Kiran
Update: 2024-01-06 13:26 GMT

తెలంగాణలోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈనెల 13 నుంచి 16 వరకు 4 రోజుల పాటు సెలవులు ఇస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 17వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పింది. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరోవైపు సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 17 వరకు స్కూల్స్‌కు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 18న స్కూల్స్ తిరిగి తెరుచుకుంటాయని విద్యాశాఖ చెప్పింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News