తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల సమయంలో సంపత్ కుమార్ ఇంట్లో లేరు. అర్ధరాత్రి తనిఖీలకు వెళ్లిన అధికారులను చూసి సంపత్ సతీమణి మహాలక్ష్మీ స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు సంపత్ కుమార్ ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓడిపోతామన్న భయంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా.. ఉద్రిక్తత చోటుచేసుకుంది.