జగిత్యాలలో 80 ఏళ్ల వృద్ధురాలి పోటీ.. కారణం తెలిస్తే షాక్..

Update: 2023-11-07 15:15 GMT

ఎన్నికల్లో వింతలు మామూలే. భర్తపై భార్య పోటీ, ఒక ఓటు తేడాతో గెలుపు, చెరి సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా ఎంపిక వంటివనేకం జరుగుతుంటాయి. ఎవరు పోటీ చేసినా గెలవాలన్న కోరికతోనే చేస్తారు. కొన్నిచోట్ల మాత్రం ఏదో ఒక ఉమ్మడి డిమాండ్ సాధన కోసం చేస్తారు. కానీ జగిత్యాలలో ఓ వృద్ధురాలు వ్యక్తిగత కారణంతో బరిలోకి దిగింది. సొంత కొడుకు మోసం చేస్తున్నాడని కేసు పెట్టిన ఆమె విచారణలో జాప్యం జరగడంపై ఆగ్రహంతో పోటీ చేస్తోంది. మంగళవారం నామిషన్ దాఖలు చేసింది. కొడుకు తీరుపై, కోర్టు జాప్యంపై కన్నెర్ర జేసిన ఆ బామ్మ పేరు సీటీ శ్యామల.

80 ఏళ్ల శ్యామల కరీంనగర్ వాసి. కరీంనగర్‌లో ఆమెకు ఒక ఇల్లు ఉంది. కొడుకు తప్పుడు పత్రాలతో చూపి తనదేనంటూ ఇంట్లోంటి గెంటేశాడని ఆమె చెబుతోంది. నిలవ నీడ లేకపోడంతో ప్రస్తుతం జగిత్యాలలో బంధువుల ఇంటిలో తలదాచుకుంటోంది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె కొన్నేళ్ల కిందట కోర్టులో కేసు వేసింది. కోర్టు విచారణ నత్తనడకలా సాగుతుండడంతో శ్యామలకు కోపమొచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె జగిత్యాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.


Tags:    

Similar News