Muthireddy Yadagiri Reddy: టీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

By :  Krishna
Update: 2023-10-08 09:46 GMT

టీఎస్ఆర్టీసీ చైర్మన్గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ చేసేలా ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కాగా ఈ సారి జనగామ ఎమ్మెల్యే టికెట్ ముత్తిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొంతకాలంగా ముత్తిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పల్లాపై బహిరంగ ఆరోపణలు సైతం చేశారు. ఈ క్రమంలో ఆయనను టీఎస్ఆర్టీసీ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు. దీంతో పల్లాకే బీఆర్ఎస్ టికెట్ అనే వాదనలు బలపడ్డాయి. టీఎస్ఆర్టీసీకి మూడో చైర్మన్‌గా ముత్తిరెడ్డి నిలిచారు. అంతకుముందు ఉన్న బాజరెడ్డి గోవర్ధన్ పదవికాలం ముగియడంతో ఆయన స్థానంలో ముత్తిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.

Tags:    

Similar News