నాన్న ఎప్పుడు రాజీనామా చేస్తావ్.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన కూతురు

By :  Kiran
Update: 2023-07-20 04:10 GMT

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ‘‘చేర్యాలలోని పెద్ద చెరువు స్థలాన్ని కబ్జా చేసినట్లు మా నాన్న అంగీకరించారు. తప్పు చేశానని ఒప్పుకున్నాక కూడా ఇంకా ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు’’ అని భవానీరెడ్డి ప్రశ్నించారు. కుమార్తె భవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డి తన అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ముత్తిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడిపై జనగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీరిద్దరితో పాటు హైదరాబాద్‌లో అల్లుడి ఆఫీసులో పని చేసే శివరామకృష్ణను విచారణ నిమిత్తం జనగామ స్టేషన్కు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో భవానీరెడ్డి, రాహుల్‌రెడ్డి, శివరామకృష్ణ జనగామకు వచ్చారు. ఎమ్మెల్యే అధికారిక పర్యటనను అడ్డుకున్నారనే ఆరోపణలతో పాటు ఇతర విషయాలను పోలీసులు వారిని అడిగినట్లు సమాచారం.




 

కాగా ముత్తిరెడ్డి అధికారిక కార్యక్రమాన్ని తాను ఎప్పుడూ అడ్డుకోలేదని తుల్జాభవానీరెడ్డి అన్నారు. ఆయన చేసిన తప్పులను బయటపెడుతున్నాననే అక్కసుతోనే తమపై కోర్టుకు వెళ్లారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదన్నారు.కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News