టీడీపీతో పొత్తు.. నాదేండ్ల అధ్యక్షతన కమిటీ..

Update: 2023-09-16 16:35 GMT

టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ పెద్దలకు వివరిస్తానని చెప్పారు. ‘‘ టీడీపీతో పొత్తు అంశాన్ని అమిత్ షా, జేపీ నడ్డాకు వివరిస్తా. అసలు పొత్తు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో తెలియజేస్తా. ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి పొత్తు అంశాన్ని వారికి వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏపీలోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’’ అని పవన్ తెలిపారు.

టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీతో సమన్వయం చేసుకునేందుకు జనసేన ఒక కమిటీని ఏర్పాటుచేసింది. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని పవన్ తెలిపారు. స్పీకర్‌గా పనిచేసిన నాదేండ్ల అనుభవం ఇందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులు ఎలాంటి భేషజాలకు పోవొద్దని సూచించారు. ‘‘ఒకరు ఎక్కువ కాదు..మరొకరు తక్కువా కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే ముఖ్యం. పదేళ్ల నుంచి మీరు అండగా ఉన్నారు.. కొంత మంది 2009 నుంచి ఎదురు చూస్తున్నారు.. అది 2024లో సాధిద్దాం’’ అని పవన్ అన్నారు.

వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పార్టీ శ్రేణులు, అభిమానులు గొడవ పెట్టుకోవద్దని పవన్ సూచించారు. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయం అన్నారు. 2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘‘జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర దశ, దిశ మారుస్తాం. కొందరు అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకుని.. త్వరలో రాబోయే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఏపీకి బలమైన భవిష్యత్‌ ఇస్తాం’’ అని పవన్ అన్నారు.


Tags:    

Similar News