JEE Main 2024 Final Results : ఇవాళ జేఈఈ మెయిన్ ఫలితాలు.. ఫైనల్ ఆన్సర్ కీ విడుదల

Byline :  Krishna
Update: 2024-02-12 09:16 GMT

జేఈఈ మెయిన్ తొలి విడత ఎగ్జామ్స్ ఫైనల్ కీ విడుదలైంది. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగాయి. దీనికి సంబంధించిన తుది ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 5రోజుల క్రితం ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్లనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 8వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇవాళ ఫైనల్ కీని విడుదల చేసింది.

మరోవైపు ఇవాళే రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన మూడు వారాల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించింది. ఇక తొలి విడత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్కు 12,25,529మంది హాజరయ్యారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15వరకు నిర్వహించనున్నారు. కాగా ఈ సారి సిలబస్లో మార్పులు చేశారు. మ్యాథ్స్లో 5 శాతం, ఫిజిక్స్లో 5 శాతం, కెమిస్ట్రీలో 20శాతం తగ్గించారు. దీంతో విద్యార్థులకు కొంత భారం తగ్గనుంది. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు.

Tags:    

Similar News