కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం.. జనసేన పోటీ చేసే స్థానాలివే..!

By :  Kiran
Update: 2023-11-05 16:06 GMT

తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకం వ్యవహారం కొలిక్కివచ్చింది. పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో బరిలో దిగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంలో బీజేపీ నేతలతో జరిగిన భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌ కర్నూల్‌, కోదాడ, కూకట్‌పల్లి స్థానాలు జనసేనకు కేటాయించినట్టు సమాచారం. శేరిలింగంపల్లి సీటు కోసం జనసేన పట్టుబడుతుండగా.. బీజేపీలోనూ ఆ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రంలో శేరిలింగంపల్లి స్థానాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ 7న ప్రధాని మోడీ పర్యటన తర్వాత శేరిలింగంపల్లి సీటుపై క్లారిటీ వచ్చే ఛాన్సుంది.

జనసేన 11 టికెట్లు డిమాండ్ చేసినా తాజా చర్చల అనంతరం 8 స్థానాలకు అంగీకరించినట్టు తెలుస్తోంది. రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ ఇప్పటికి 88 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగిలిన 31 స్థానాల్లో 8 సీట్లలో జనసేన బరిలోకి దిగుతుండటంతో మిగిలిన 22 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News