నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నారు.. బీజేపీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి
బీజేపీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే.. కాంగ్రెస్ పార్టీని ఆకాశానికెత్తేసిన ఆయన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన కామెంట్స్.. కాంగ్రెస్ చేరడం ఖాయం అన్నట్లు తెలుస్తోది.
తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి... తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇక మానసికంగా బిజెపి పార్టీకి దూరమయ్యా.. కార్యకర్తగా మాత్రమే ఉన్నాననంటూ పేర్కొన్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఉద్యమాకాంక్షలు నెరవేస్తారని బిజెపిలో చేరానని.. తెలంగాణ ఆకాంక్ష బిజెపితో నెరవేరాదని అర్థమయిందని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అబద్ధాలు చెప్తే నమ్ముతారేమో కానీ ఇక్కడ నమ్మరన్నారు . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని విమర్శించే స్థాయి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి లేదని అన్నారు.
బిజెపి బండి సంజయ్ ను మార్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశానని.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 నెలలగా బిజెపిలో ఉన్నా.. ఏ ఒక్క కార్యక్రమం చేయనివ్వలేదు…. బండి సంజయ్ ను తొలగించడం హీనమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు జిట్టా బాలకృష్ణారెడ్డి. డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేయడం లేదని.. కేసీఆర్ నిరంతృత పాలన పోవాలంటే.. కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని.. కార్యకర్తలతో సమావేశమైన తర్వాత నిర్ణయం చెబుతానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈ బీజేపీ నేత త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త జోష్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీలో చేరికలు పెరిగాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సభలో ఆయన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.