మహారాష్ట్ర బీఆర్ఎస్లో భారీగా చేరికలు

Update: 2023-07-30 05:34 GMT

మహారాష్ట్ర బీఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ సంగ్రామ్‌ సింగ్‌ జై సింగ్‌ రావ్‌ గైక్వాడ్‌ తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ లో చేరారు. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, షుగర్ మిల్లుల యజమాని బాలాసాహెబ్‌ కన్నవార్‌ సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. బాలా సాహెబ్కు మరాఠా ధన్‌కర్‌ సామాజికవర్గంలో గట్టి పట్టుంది.




 


ఉస్మానాబాద్‌ జిల్లాకు చెందిన రైతు ఉద్యమ నాయకుడు కిషన్‌ హరిశ్చంద్ర కశీద్‌, శివసేన నేతలు ప్రాగ్‌ శ్యామ్‌రావ్‌ పాటిల్‌, పుండలీక్‌ కృష్ణాజీ జాదవ్‌, నీతాశ్యామ్‌ రామ్‌ గైక్వాడ్‌, ఉస్మానాబాద్‌ జిల్లా ఆర్‌ఎస్‌పీ అధ్యక్షుడు ఓంకార్‌ నికమ్‌, కాంగ్రెస్‌ నేత విశ్వజిత్‌ షిండే, ప్రొఫెసర్‌ శరద్‌ కాంబ్లే, ఆర్‌ఎస్‌పీ మహారాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మాణిక్‌ పోలా, ఛత్రపతి సేన రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్‌ బాహూ మాల్మే తదితరులకు సీఎం కేసీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు శంకరన్న డోంగే తదితరులు సైతం పాల్గొన్నారు.




Tags:    

Similar News