తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కుటుంబానికే లాభం జరిగింది: జేపీ నడ్డా

By :  Bharath
Update: 2023-11-19 08:36 GMT

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నారాయణపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జమ్మూ కశ్మీర్‌, బిహార్‌, యూపీ, పంజాబ్‌ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయని.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికే లబ్ధి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ అధికంగా నిధులు కేటాయించారని చెప్పారు. ధరణి పోర్టల్‌ ద్వారా పేదల భూములు కేసీఆర్‌ దోచుకున్నారని నడ్డా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజం బాగుపడుతుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చేయడం ఈజీ అవుతుందని చెప్పారు. బీజేపీకి అధికారం ఇస్తే.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.

Tags:    

Similar News