తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే
By : Mic Tv Desk
Update: 2023-07-19 16:22 GMT
జులై 5న సుప్రీం కోర్ట్ పలువురు జడ్జిల బదిలీలకు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఆ కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురు జడ్జిలను కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జస్టిస్ అలోక్ అరాధే.. తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నాటక హైకోర్ట్ జడ్జిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ హైకెర్ట్ జడ్జిగా ఉన్న సామ్ కొశాయ్ హైకోర్ట్ జడ్జిగా బదిలీ అయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు అయిన తర్వాత జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు.