ప్రేమికులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

By :  Vamshi
Update: 2024-02-14 16:21 GMT

వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భారీ శుభావార్త చేప్పారు. ఎవరైన ప్రేమించుకుని పెళ్లికి వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే తన వద్దకు రావాలన్నారు. తాను ఒప్పించి వివాహం చేస్తానని ప్రేమికుల రోజుకు ఇదే నా గిప్టు అని చెప్పారు. పెళ్లయ్యాక ఓటు మాత్రం తన పార్టీకి వేయాలని కండీషన్ పెట్టడం గమనార్హం. పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను కూడా కులాలు, మతాలకు ఆతీతంగా మ్యారేజ్ చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన భార్య కూడా దళితురాలని.. రూ.2 వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నానని తెలిపారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు ఇదే తన మెసేజ్ అని చెప్పారు. ఈ ఆఫర్‌తో లవర్స్ ఓట్లన్నీ మనకేనని పాల్ తనదైన శైలీలో ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాల్ ఆఫర్‌పై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికలకు కేఏ పాల్ సిద్ధమవుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుండి ఎంపీగా పోటీ చేస్తానని పాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News